Sunday, October 10, 2021

Tapana (Telugu)

 (A poem written in my mother tongue, Telugu)

తపన 


ఎటు చూసినా ఏ లోటూ లేని అనంతమైన సాగరం 

మరి ఎందుకో ఆ అలకు అంతులేని ఆరాటం 

మిన్నును ముద్దాడాలని ఒక కలను తాను కనింది 

ఆ తపన మదిని రగిలివేయ ఎగసి ఎగసి పడింది 


ఆ తపన మెచ్చిన సూర్యుడు ఒక చేయి అందించాడు 
మేఘమై తన చెంత చేరమని ఆహ్వానం పంపించాడు 
అది విన్న ఆ అల ఆనందంతో ఆవిరైపోయింది 
తనను తాను అర్పించి తన కలను నిజం చేసుకుంది 

కానీ గమ్యం లేని ప్రయాణాలు ముగియవుగా ఏనాటికి 
ఎంత దూరం వెళ్ళినా తాకలేదు ఆ మేఘం మింటిని 
ఇక ఒక కొండకు తల బాదుకుని వెక్కి వెక్కి ఏడ్చింది 
తన కన్నీటిలో తానే కరిగి వర్షమై కురిసింది 


ఏరుగా పారి సంద్రానికి చేరింది 
అందని మిన్ను కన్నా ఇంటి పట్టునే సుఖమని భ్రమసింది 
ఇంతలో ఒక అసంతృప్తి మళ్ళీ మొదలయ్యింది 
ఎదో తపన రగిలివేయ ఎగసి ఎగసి పడింది 


మైథిలీ 

Liberty, Equality, Fraternity, and the Bhagavad Gita

An article written by me

 https://www.indica.today/long-reads/liberty-equality-fraternity-and-bhagavad-gita/